మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడి తగ్గిందా? నిపుణుల సూచనలు ఇవే
కోల్ బెల్ట్ న్యూస్ డెస్క్: ప్రస్తుత కాలంలో బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన దీర్ఘకాలిక రాబడులు పొందాలనే ఉద్దేశంతో చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొన్నిసార్లు ఫండ్స్ రాబడి తగ్గడం లేదా నష్టాలు కనిపించడం సహజం. అలాంటి సమయంలో తొందరపడి పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్ నేరుగా షేర్ మార్కెట్‌కు అనుసంధానమై ఉంటాయి. మార్కెట్ పతనమైనప్పుడు ఫండ్ విలువ కూడా తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో...