జూలై 28,29న మిర్యాలగూడలో ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలు
పోరాటాల ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జూలై 28, 29 తేదీలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగనున్న ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ సమావేశాలకు తెలంగాణలోని 25 జిల్లాల నుంచి సుమారు 70 మంది...