సుమంగళి స్త్రీలు పూర్తి తలనీలాలు సమర్పిస్తే ఏమవుతుంది ?

కోల్ బెల్ట్ న్యూస్ డెస్క్; తిరుమలతో పాటు దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాల్లో భక్తులు మొక్కులు తీర్చుకునే సందర్భంగా తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చిన్నారులు, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అనేక మంది భక్తులు గుండు చేయించుకుంటుంటారు. అయితే, తలనీలాల సమర్పణ వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక భావాన్ని తెలుసుకోవడం అవసరమని ధర్మశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక వేత్త సూర్యనారాయణమూర్తి వివరాల ప్రకారం, ఏ దేవుడూ భక్తులను తప్పనిసరిగా జుట్టు సమర్పించమని కోరలేదని పేర్కొంటున్నారు. మనిషిలోని అహంకారం, అందంపై ఉన్న మమకారాన్ని...