ప్రజా ఉద్యమాల ముందు తలవంచిన ప్రధానులు …..
ఎమర్జెన్సీ నుంచి రైతు చట్టాల వరకు. హిందీ వ్యతిరేక ఉద్యమం నుంచి నీట్ వివాదం వరకు ప్రజా ఒత్తిడికి మారిన ప్రభుత్వ నిర్ణయాలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: భారతదేశంలో ప్రజా ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజల ఆందోళనలు ప్రభుత్వ విధానాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. అనేక సందర్భాల్లో ప్రజా వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మరికొన్ని సందర్భాల్లో ప్రజా ఆగ్రహం ఎన్నికల్లో అధికార మార్పుకు కూడా దారితీసింది....