ఆగస్టు 3న జిల్లా కలెక్టరేట్ ముట్టడి

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 3న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, బడుగు, బలహీన వర్గాలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భూమిలేని నిరుపేదలకు సాగుభూములు పంపిణీ చేయడం, అసైన్డ్ భూములకు...