CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 5:37 pm Posted by : coalbelt 24 News

ఆగస్టు 3న జిల్లా కలెక్టరేట్ ముట్టడి

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 3న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలకు పిలుపునిచ్చారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, బడుగు, బలహీన వర్గాలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భూమిలేని నిరుపేదలకు సాగుభూములు పంపిణీ చేయడం, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించడం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళితులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంతో పాటు సంక్షేమ హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను నియంత్రించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం, ఎస్సీలకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం, ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీ నిధులు విడుదల చేయడం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారి పీఎఫ్ నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం తిలక్ అంబేద్కర్, జిల్లా నాయకులు దాసరి శ్రీధర్, లింగాల వెంకటేశ్వర్లు, దెబ్బేట ప్రసాదరావు, దేవికిరణ్ లాల్, ఆర్.జీ. రాజేందర్, దాసరి సంపత్, సదాలక్ష్మి, రేణుక, దివ్య, జయమ్మ, యశోద తదితరులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});