ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన వరకూటి ప్యానల్
అధ్యక్షుడిగా భీమనాదుల అశోక్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
కోల్ బెల్ట్ న్యూస్(ఖమ్మం):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉమ్మడి ఖమ్మం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా వరకూటి మోహన్ ఘన విజయం సాధించారు. ఆదివారం ఖమ్మం పట్టణంలోని సితార కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఎన్నికల అనంతరం ఈ ఫలితాలను ఎన్నికల అధికారి నార్లపాటి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఈ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ పరిశీలకుడిగా కనపర్తి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడాక్ కమిటీ చైర్మన్ క్రిస్టాఫర్ ఆమోదించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని 18 మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఓటర్లుగా పాల్గొన్నట్లు తెలిపారు.
మొత్తం 36 మంది ఓటర్లలో 31 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఐదుగురు గైర్హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి వరకూటి మోహన్, తీగమల్ల నాగేష్ మధ్య పోటీ జరగగా, వరకూటి మోహన్ ప్యానల్‌కు పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. మొత్తం నమోదైన 31 ఓట్లలో ఒక ఓటు కోశాధికారి ఎన్నికలో సాంకేతిక కారణాలతో రద్దు కావడంతో, కోశాధికారిగా కోపేల పుల్లయ్య 30 ఓట్లతో విజయం సాధించారు.

అధ్యక్షుడిగా భీమనాదుల అశోక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఇందుర్తి బ్రహ్మానంద రెడ్డి, కోడిశెల అనిల్, బందెల్ల భాస్కరరావు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఇనపనూరి రామాంజనేయులు, జెట్టి రామకృష్ణ, లింగాల బాలరాజు, సంద్ర నితిన్ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా అరికట్ల రామారావు, కలక నవీన్ కుమార్, కళ్లెం ధర్మభిక్షం, పాలేపోగు సాయితేజ, పరిగడపు రామారావు విజయం సాధించారు. వరకూటి మోహన్ ప్యానల్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం విశేషం. నమోదైన 31 ఓట్లలో 31 ఓట్ల మద్దతు లభించడం ద్వారా ఈ ప్యానల్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
ఈ ఎన్నికల నిర్వహణలో ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి క్రిస్టాఫర్, ఎన్నికల అధికారులు గుడిమెట్ల బాలసైదులు, నార్లపాటి అరుణ్ కుమార్, గోరంట్ల శాంతారావు, డీవైఎస్‌వో ఎం.డి. గౌస్, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ పరిశీలకుడు కనపర్తి రమేష్ పాల్గొని ఎన్నికలను సజావుగా నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});