CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 10:38 am Posted by : coalbelt 24 News

నేడు విద్యాసంస్థల బంద్‌:ఎండీ వాజీద్

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ జూలై 20న లక్షలాది మంది విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎండీ వాజీద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనను అణిచివేసేందుకు పోలీసులు రక్తం కళ్లజూసేలా లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యార్థులపై జరిగిన ఈ దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు జూలై 24న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ఈ బంద్‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు సంపూర్ణంగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను తెలియజేసే హక్కును కాలరాయడం తగదని ఎండీ వాజీద్ అన్నారు. విద్యార్థి సంఘాల బంద్ పిలుపునకు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని కోరారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});