బీబీపేట లో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ, అలాగే విద్యార్థులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. విద్యార్థులు, మేధావులు జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ కేంద్ర విద్యాశాఖ...