మెడికల్ బోర్డు అక్రమాలపై శాంతిఖని గనిలో కార్మికుల ధర్నా
పారదర్శకంగా మెడికల్ బోర్డులు నిర్వహించాలి సింగరేణి మనుగడకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలి ఏఐటీయూసీ నాయకుడు మిట్టపల్లి వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): సింగరేణి శాంతిఖని గనిపై మంతెన రమేష్ అధ్యక్షతన శనివారం కార్మికులు ధర్నా నిర్వహించారు. జూలై 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి కార్మిక నాయకుడు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్మికుల శ్రమను దోపిడీ...