కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి
నీట్ పరీక్ష రద్దుపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆగ్రహం గోదావరిఖనిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): నీట్ పరీక్ష పత్రం లీక్ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను...