కేటీఆర్ పాదయాత్రతో కష్టాలు తీరేనా ?
ప్రజా సమస్యలపై తెలుసుకోవడం యువతకు ప్రాధాన్యత పాదయాత్రతో పరిస్థితులు మారేనా ? కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాదయాత్ర రాజకీయాలపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పాదయాత్ర చేపట్టే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం పెంచుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది. ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం,...