“కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే ఓడిపోయాం”
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): 2023 ఎన్నికల ఓటమిపై తొలిసారి బహిరంగ ఆత్మపరిశీలన చేసిన కేటీఆర్.. 100 శాతం తప్పులు మావేనని అంగీకారం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంపై తొలిసారిగా బహిరంగంగా ఆత్మపరిశీలన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం పార్టీ చేసిన తప్పులేనని స్పష్టం చేశారు. "మా కళ్లు...