సమస్యలతో సతమతమవుతూన్న చెన్నూర్ ప్రజలు
కోల్ బెల్ట్ న్యూస్(చెన్నూర్): చెన్నూరు పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలు కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) జిల్లా కమిటీ ఆరోపించింది.సోమవారం చెన్నూర్ పట్టణంలో పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కన్వీనర్ సంకె రవి, జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ ... చెన్నూర్ పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలైన...