కాసిపేట-1 ఇంక్లైన్ గనిని సందర్శించిన డీజీఎంఎస్ అధికారులు

గని రికార్డులను తనిఖీ చేసిన డీజిఎంఎస్ గని అభివృద్ధికి పలు సూచనలు కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 ఇంక్లైన్ గనిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) అధికారులు సందర్శించి గనిలో నిర్వహిస్తున్న భద్రతా చర్యలు, నిర్వహణ విధానాలు, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గనిలోని వివిధ పని ప్రదేశాలను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గనికి చేరుకున్న డీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్, డీడీఎంఎస్...