CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:53 am Posted by : coalbelt 24 News

రాష్ట్ర గవర్నర్‌తో బీజేపీ మైనార్టీ మోర్చా

రాష్ట్ర సమస్యలపై గవర్నర్ తో చర్చ
మైనార్టీల అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జగ్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్‌తో కూడిన ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమకాలీన అంశాలతో పాటు మైనార్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు విషయాలపై గవర్నర్‌తో ప్రతినిధి బృందం చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అలాగే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పలు అంశాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అనంతరం గవర్నర్ శివప్రసాద్ శుక్లకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి కొనసాగుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన మైనార్టీ మోర్చా నాయకులు పా
ల్గొన్నారు.

 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});