తాడిచెర్ల-2 బొగ్గు గని సింగరేణికి.. ప్రధాని అంగీకారం

సింగరేణిలో పెరుగనున్న ఉత్పత్తి కొత్తగా ఉపాధి అవకాశాలు కోల్ బెల్ట్ న్యూస్(సింగరేణి ప్రతినిధి): తెలంగాణకు కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించేందుకు ప్రధాన మంత్రి అంగీకరించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థకు కొత్త ఊపు లభించడంతో పాటు రాష్ట్ర బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇటీవల సింగరేణికి కొత్త బొగ్గు గనుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. ఈ నేపథ్యంలో తాడిచెర్ల-2 గనిని...