నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాల్సిందే
సీటీయూ మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలను తగ్గించేలా జారీ చేసిన జీవోలను వెంటనే సవరించాలని సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (CTU) మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగ, కార్మిక వర్గానికి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు గట్టు మహేందర్ అధ్యక్షతన సీటీయూ జిల్లా ఆఫీస్...