CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 6:04 pm Posted by : coalbelt 24 News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రజనీష్ జైన్ జన్మదిన వేడుకలు

పండుగలా పుట్టినరోజు వేడుక
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మోర్చా నేతలు 
ఆశీర్వదించిన జాతీయ,రాష్ట్ర స్థాయి కమలం నేతలు

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్)




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

:

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్ సమక్షంలో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.రజనీష్ జైన్ కు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మైనార్టీ మోర్చా భాద్యులు, రాష్ట్ర బాధ్యులతో రాష్ట్ర కార్యాలయం లో పాల్గొని శుభాకాంక్షలు తెలుపడంతో కార్యాలయంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్బంగ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ….

ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై రజనీష్ జైన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. అదేవిదంగా బీజేపీ మైనార్టీ మోర్చా ప్రభారి జయశ్రీ, బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, మైనార్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు రజనీష్ జైన్ సేవలను కొనియాడుతూ, ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ జిల్లాల నాయకులు కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});