బీబీపేట్ గ్రామంలో ఇంటింటికీ SIR

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలోని 77వ బూత్ పరిధిలో ప్రత్యేక ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి SIR అప్లికేషన్ ఫారాలను పంపిణీ చేస్తూ, ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ (సవరణ) కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR కార్యక్రమం గురించి ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుని, అవసరమైన సవరణలు...