తిరుమలకు భారీ విరాళాలు ప్రకటించిన అనంత్ అంబానీ

టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు – 50 మంది డ్రైవర్ల వేతనాల బాధ్యత కూడా రిలయన్స్ సంస్థనే కోల్ బెల్ట్ న్యూస్(తిరుమల): తిరుమల–తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందజేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అంతేకాకుండా, ఈ బస్సులను నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్ల వేతనాలను కూడా తానే భరిస్తానని అనంత్ అంబానీ తెలిపారు. దీంతో టీటీడీపై ఆర్థిక భారం...