కుప్పంలో బంగారు గనులకు ఆశలు….
జీఎస్ఐ ప్రాథమిక సర్వేలో కీలక సంకేతాలు రూపురేఖలు మారనున్న కుప్పం నియోజకవర్గం కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో బంగారం గనుల అభివృద్ధికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక భౌగోళిక అన్వేషణలో, కుప్పం పరిసర ప్రాంతాల భూగర్భంలో స్వర్ణ ఖనిజాల ఉనికికి అనుకూల ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మరింత సమగ్ర అన్వేషణ...