CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 5:02 pm Posted by : coalbelt 24 News

బీబీపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

బీబీపేట మండలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాత రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు ముగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సొంత ఇంటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాత్విక, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, మాజీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, జిల్లా నాయకులు భూమా గౌడ్, మహమ్మద్ సలీం, మండల యువజన అధ్యక్షుడు మల్లుగారి మహేష్, శ్రీకాంత్, ఆసిఫ్, రవి, పర్షా గౌడ్, సత్తయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అరుణ్ శర్మ, మ్యాదరి సృజన స్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});