తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు..?

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎస్‌గా కొనసాగుతున్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో, కొత్త సీఎస్ ఎంపికపై గత కొద్దిరోజులుగా సచివాలయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావించే, ఐటీ మరియు పురపాలక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జయేష్ రంజన్ పేరు బలంగా వినిపించినప్పటికీ,...