గడప,గడపకు బీసీ చైతన్యం

బీసీ హక్కుల కోసం పోరాటం రాజకీయంగా బీసీ లు ఎదగాలి పేరం అలేఖ్య నటేశ్వర్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): బీసీ సమాజం ఐక్యమై రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని బీసీ మహిళ రాష్ట్ర కన్వీనర్, న్యాయవాది పేరం అలేఖ్య నటేశ్వర్ పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఐక్యత లోపించడమే వారి వెనుకబాటుతనానికి...