క్రెడిట్ కార్డు భారం నుంచి బయటపడేందుకు మార్గాలు ఇవే ….
క్రెడిట్ కార్డు సౌకర్యవంతమైన ఆర్థిక సాధనం. అయితే, బిల్లులను సకాలంలో చెల్లించకపోతే అధిక వడ్డీ, జరిమానాలు చేరి అప్పు భారం పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మార్గాలు ఉపయుక్తంగా ఉంటాయి. 1. ఈఎంఐ (EMI)గా మార్చుకోవడం..... క్రెడిట్ కార్డు బకాయిలను ఒకేసారి చెల్లించలేని పరిస్థితి ఉంటే, బ్యాంకు లేదా కార్డు సంస్థ ద్వారా వాటిని EMIగా మార్చుకోవచ్చు. ప్రయోజనాలు..... నెలవారీ చెల్లింపులు సులభమవుతాయి. అధిక వడ్డీ భారం తగ్గుతుంది. ఆర్థిక ప్రణాళిక సులభంగా చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది....