సింగరేణిలో 9 కొత్త గనులు…

మూతపడనున్న నాలుగు గనులు సంస్థపై ఆర్థిక భారం తొమ్మిది కొత్త ఉపరితల గనులకు ప్రణాళికలు కోల్ బెల్ట్ న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం): తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి కాలరీస్ సంస్థ (SCCL) భవిష్యత్తుపై కార్మిక వర్గం, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బొగ్గు ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో సంస్థ మనుగడ, ఉద్యోగ భద్రత, భవిష్యత్ విస్తరణపై చర్చలు జోరందుకున్నాయి.2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సింగరేణి యాజమాన్యం 6 కోట్ల టన్నులకు పరిమితం...