సింగరేణిలో “బొగ్గు “లేఖలు

సింగరేణి బొగ్గు వివాదం కిషన్ రెడ్డి లేఖ వెనుక రాజకీయ వ్యూహమా ? కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల) : సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ కుంభకోణం జరిగిందంటూ వెలువడుతున్న కథనాల నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందన్న ఆరోపణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి లేఖ రాయడంలో...