ఎవరిపై నీ పోరాటం …

రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరాటం కొత్త చర్చలకు దారితీస్తున్న కేటీఆర్ మాటలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతుంటాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ వ్యూహాలు, నాయకత్వం చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుందని, పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటించారు. అయితే రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఈ ప్రకటనలతో పాటు పార్టీ క్షేత్రస్థాయి రాజకీయ...