CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 1:35 pm Posted by : coalbelt 24 News

డిప్యూటీ సీఎం ను కలిసిన NHM JAC నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ను శనివారం మంచిర్యాలలో NHM JAC ఉద్యోగుల ప్రతినిధులు కలిసి తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా NHM JAC Employees Telangana State వ్యవస్థాపక అధ్యక్షులు డా. మహేందర్ రావు మాట్లాడుతూ…




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాష్ట్రవ్యాప్తంగా NHM ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ వేతనాల చెల్లింపు, సర్వీస్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ సంబంధిత అంశాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో డా. మహేందర్ రావు పుట్ట (వ్యవస్థాపక అధ్యక్షులు, NHM JAC Employees Telangana State), రాజేంద్ర ప్రసాద్ (హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి), సంతోష్, డా. రామకృష్ణ, మధుబాబు, శశికాంత్, డి. వినోద్ (మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్), సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});