CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:57 am Posted by : coalbelt 24 News

ఇంగ్లాంగ్,ఐర్లాండ్ పర్యటనకు ఇండియా టి-20 జట్టు ఖరారు

జట్టులోకి వైభవ్ సూర్య వంశీ
కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

మంచిర్యాల (కోల్ బెల్ట్ న్యూస్): ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో పాల్గొనే భారత టీ-20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులో తొలి అవకాశం దక్కడం విశేషం. జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఐపీఎల్‌లో ప్రతిభ చాటిన కొందరు యువ ఆటగాళ్లకు ఈ పర్యటన కీలకం కానుంది. ప్రధానంగా జట్టులో అతి చిన్న వయస్సు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో ఎంపిక కావడం విశేషం.

జట్టులో మహ్మద్ సిరాజ్, రవీ బిష్ణోయ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తిలకు కూడా చోటు కల్పించారు

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});