CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:25 am Posted By: coalbelt 24 News

అంకుల్…మా పార్టీలోకి వద్దు

TRS లో చేరడానికి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం
సున్నితంగా తిరస్కరించిన కవిత

కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్పుడే కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. రాజకీయ హోదాలో ఉన్న నేతలకు ఇప్పుడు నిరుద్యోగం వెంటాడుతోంది. ఇంటిముందు ఎప్పుడు చూసినా అధికారులు, పార్ట్ శ్రేణులతో కళకళ ఉండేది ఇల్లు. అలాంటి ఆర్భాటం లేకపోయేసరికి ఏ పార్టీలో చేరితే పూర్వవైభవం దక్కుతుందని చెన్నూర్ నియోజకవర్గం నేతలు ఆరాటపడుతున్నారు. అందులో నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చెన్నూర్ నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్యేలల్లో కొందరు ఇప్పటికే జనసేన పార్టీలో చేరడానికి మంతనాలు జరిపారు. ఆ మంతనాలు ఫలితం ఇవ్వలేదు. తాజాగా రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆవిర్భవించిన TRS లో చేరడానికి నియోజకవర్గంకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఆ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థనను ఆమె సున్నితంగా తిరస్కరించారు. ” అంకుల్ ” మీరు మా పార్టీలోకి వద్దు. మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు అంటూ సెలవిచ్చినట్టు రాజకీయ వర్గాల సమాచారం.

ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే పలు పార్టీలు మారారు. ఇప్పుడున్న పార్టీలో ఆయనను ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. అందుకే సొంతంగా తన బలమేమిటో చూపించడానికే మరో పార్టీని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే తనకున్న పరిచయాల ద్వారా కాషాయం నేతలతో కూడా మంతనాలు జరిపారు. ఏ పార్టీలో చేరాలనేది తేల్చుకోలేక ఆ మాజీ ఎమ్మెల్యే కొట్టుమిట్టాడుతున్నారు .




(adsbygoogle = window.adsbygoogle || []).push({});