CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 11:15 am Posted by : coalbelt 24 News

కాషాయ జెండాతోనే కడవరకు

పార్టీలో పెరిగిన భాద్యత
దేశ సేవకు వచ్చిన అవకాశం
ప్రజల ఆశీర్వాదంతోనే అందలం
బిజెపి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కోల్ బెల్ట్ న్యూస్ : మంచిర్యాల : కాషాయ జెండా తోనే కడవరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతానని బిజెపి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాలలో మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో పాటు పలువురు పార్టీ నాయకులు రజనీష్ జైన్ ను ఘనంగా సన్మానించారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా అయన మంచిర్యాలకు రావడంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ …..

రాష్ట్ర స్థాయి పదవి చేపట్టడంతో పార్టీ అభివృద్ధికి మరింత భాద్యత పెరిగిందన్నారు. మండల, పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ అప్పగించిన బాధ్యతల్లో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా సంఘ్ పరివార్ నుంచి మొదలుకొని విద్యార్ధి పరిషత్, పార్టీ బాధ్యతలను నెరవేర్చడం జరిగిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం పనిచేశాను. పార్టీ అభివృద్ధి కోసం కొందరి మనసు నొప్పించాను కావచ్చు, అర్థం చేసుకొని నా వెంట నడిచిన వారికి ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీలో పదవులు వస్తాయి. అదే స్థాయిలో ప్రజలతో పాటు కార్యకర్తల ఆశీర్వాదం కూడా ఉండాలన్నారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల బలం నాయకుడికి అండగా ఉండాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు అభిమానులు, చిన్ననాటి స్నేహితులు పాల్గొన్నారు.

 

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});