CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 11:42 am Posted by : coalbelt 24 News

సికింద్రాబాద్ సభ సక్సెస్

తెలంగాణ ప్రజలంతా మోదీ వైపే
ప్రత్యర్థులకు బీజేపీ బలమేమిటో తెలిసిపోయింది
తెలంగాణలో వచ్చేది కాషాయం ప్రభుత్వమే
మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్

కోల్ బెల్ట్ న్యూస్, మంచిర్యాల :




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం మొదటి సారి తెలంగాణ గడ్డపై బీజేపీ ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ సభ విజయవంతమైనదని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ అన్నారు. సోమవారం ఆయన కోల్ బెల్ట్ న్యూస్ తో మాట్లాడుతూ సభ ఏర్పాట్లకు సహకరించిన రాష్ట్ర రెవెన్యూ, పోలీస్ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే విదంగా సభ విజయవంతం కావడానికి కృషిచేసిన పార్టీ ప్రజాప్రతినిధులకు, పార్టీ దాని అనుబంధ సంఘాలకు చెందిన నాయకులకు, బాద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూస్తే తెలంగాణ ప్రజలంతా మోదీ వైపే ఉన్నారనేది స్పష్టమైనదన్నారు. తెలంగాణలో పార్టీ ప్రత్యర్థులకు కూడా బీజేపీ బలమేమిటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరిన్ని నిధులు మంజూరు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఖాయమన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});