CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 1:07 pm Posted by : coalbelt 24 News

రాష్ట్ర ప్రజల సంక్షేమమే మోదీ ధ్యేయం

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు
కాలయాపన చేస్తున్న ప్రతిపక్షాలు
బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కోల్ బెల్ట్ న్యూస్ , మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలనీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కోల్ బెల్ట్ న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో వెనుకడుగు వేయడంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాన పాత్ర ఉందన్నారు.

ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కాలయాపన చేస్తున్నాయని రజనీష్ జైన్ ఈ సందర్బంగా ఆరోపించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కేంద్రంలోని మంత్రుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలన్నారు. ప్రజల సమస్యలు చెబితే పరిష్కరించడానికి కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కిషన్ రెడ్డి బీజేపీ పై ఆరోపణలు చేయడం మాని రాష్ట్రంలోని మంత్రులతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోఈ నెల పదిన (ఆదివారం ) ఉదయం పది గంటలకు నిర్వహించే భారీ బహిరంగ సభకు బీజేపీ తో పాటు దాని అనుబంధ సంఘాల భాద్యులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రజనీష్ జైన్ ఈ సందర్బంగా కోరారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});