CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 12:24 pm Posted by : coalbelt 24 News

Singareni : హైకోర్టు ప్యానెల్ లాయర్‌ మద్దెల రవీందర్

Singareni : తెలంగాణ హై కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానల్ లాయర్ గా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన మద్దెల రవీందర్ ఎంపికయినారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి రవీందర్ నియమాకం అమలులోకి అమలులోకి వచ్చింది. రవీందర్ గత ఆరేళ్ల నుంచి హై కోర్ట్ లో రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్ న్యాయ అంశాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ హై కోర్ట్ లీగల్ నిబంధనలు, మార్గదర్శకాల మేరకు ఈ నియామకం జరిగింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి గని కార్మికుడు మద్దెల నాగయ్య కు ముగ్గురు కుమారులు. ముగ్గురు చిన్న వయసులో ఉండగానే నాగయ్య ప్రమాదవ శాత్తు మరణించారు. తల్లి లక్ష్మి ముగ్గురిని చదివించి పెద్దచేసింది. అందులో రవీందర్ ప్రథమ సంతానం, మిగతా ఇద్దరిలో ఒకరు కానిస్టేబుల్, మరొకరు డిఆర్డిఏ లో ప్రభుత్వ ఉద్యోగి. రవీందర్ బిటెక్ చదివిన అనంతరం ఎల్ఎల్ బి పూర్తిచేసి రాష్ట్ర హై కోర్టులో న్యాయవాది వృత్తి చేపట్టారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});