CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 9:46 am Posted by : coalbelt 24 News

Kavitha : అదే రోజు…కవిత పార్టీ అవతరణ

Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు సంబందించిన పనులు వేగవంతమైనట్టు సమాచారం. పార్టీ పెడుతున్నట్టుగా కవిత ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అంతే కాదు ఆ ప్రకటనను ఆమె నిజం చేయబోతున్నారు.

ఉద్యమ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఆమె పార్టీ అభివృద్ధి పై ఘాటుగానే మాట్లాడుతున్నారు. అంతటితో ఆగకుండా
కేటిఆర్, హరీష్ రావుతో పాటు కీలక నేతలపై కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. సామజిక న్యాయం, ఆత్మ గౌరవం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వంటి నినాదాలతో ఆమె కొత్త దారి లో పయనిస్తున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండు పురస్కరించుకొని కొత్త పార్టీ పేరు, జెండా, నియమ, నిబంధనలను కవిత వెల్లడించనున్నారని జాగృతి వర్గాల సమాచారం. జాగృతి నేతలు పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. కవిత గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పండితులతో పాటు, మేధావులు, న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.

జూన్ 2 న భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించి, ఆ సభలోనే పార్టీ పేరును కూడా ప్రకటించడానికి కవిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల అసంతృప్తి నేతలు కూడా అదే రోజు కొత్త పార్టీలో చేరే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉంది. ఈ లోపు కవిత నిర్మించే పార్టీలో ఏయే పార్టీల నుంచి ఎందరు వరుస కడుతారో వేచి చూడాల్సిందే.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});