CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:57 am Posted by : coalbelt 24 News

CPI : బెల్లంపల్లి లో సీపీఐ కి ఆదరణ

CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు సీపీఐ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటర్ల నుంచి ఆదరణ లభిస్తోంది. పోరాటాల చరిత్ర ఉన్న పార్టీ కావడంతో బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులకు ప్రజలు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం పదో వార్డులో అభ్యర్థి పర్యటన విజయవంతంగా ముగిసింది. పదో వార్డు అభ్యర్థి అభ్యర్థి గుర్రాల శారద సార య్య మాట్లాడుతూ నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానన్నారు. వార్డు సమస్యల పరిష్కరానికి అవసరమైతే పోరాటాలు చేయడానికి సైతం సిద్ధంగా ఉంటానన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి గుర్రాల శారద సార య్య తో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, గోలేటి రాయలింగు, నస్పూర్ భీమయ్య,, మారాలు,తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});