CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 11:42 am Posted by : coalbelt 24 News

CPI : సీపీఐ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పార్టీ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజమౌళి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ……

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రతి పౌరుడి పై ఉందన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు కూడా ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనదని ఆయన ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను విభజించి, కార్మిక చట్టాలను తుంగలో తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు పనిచేయాలన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్తపై భాద్యత ఉందన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య , బి కే యం యు జాతీయ కౌన్సిల్ సభ్యులు అక్క పెళ్లి బాబు ,పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ , అంబేద్కర్ జిల్లా సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం , కొండు బానేష్, బొంతుల లక్ష్మీనారాయణ, రత్నం రాజ్యం, కొంకుల రాజేష్, మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు డి ఆర్ సక్కుబాయి, నాయకులు బొంకూర్ రామచందర్, అందుగుల రాజేందర్, గోలేటి రాయలింగు, ఇనుముల రాయమల్లు తో పాటు పలువురు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});