Kavitha : మహేషన్నా… మీకు…మంచి పోస్ట్ ఇస్తా …

Kavitha : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గులాబీ బాట విడిచి, సొంత బాట ఎంచుకున్నారు. అప్పటి నుంచి నిత్యం ఎదో ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటున్నారు. జాగృతి పేరుతొ జనం బాట పట్టారు. ఒకవైపు ప్రజలతో మాట్లాడుతూనే, మరోవైపు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ పరిపాలనలో అవినీతి జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రధానంగా హరీష్ రావు ను లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అప్పుడప్పుడు కేటీఆర్ ను కూడా వదిలిపెట్టడంలేదు. కవిత ఆరోపణలకు హరీష్ రావు, కేటీఆర్ సమాధానం ఇవ్వకుండా దూరంగా ఉండటం విశేషం. అయితే...