Singareni : సింగరేణి ఆధ్వర్యంలో కాసిపేట లో జిమ్
Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 సింగరేణి గని అధికారులు కాసిపేట గ్రామస్తుల విన్నపం మేరకు నూతనంగా జిమ్ ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన జిమ్ ను ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ..... కాసిపేట గ్రామ యువతీ, యువకులు జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు శరీర ఆకృతిని పెంచుకోడానికి కూడా జిమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువకులకు క్రీడా వసతి పెంచడానికి సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు....