CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 12:35 pm Posted by : coalbelt 24 News

Singareni : సింగరేణి ఆధ్వర్యంలో కాసిపేట లో జిమ్

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 సింగరేణి గని అధికారులు కాసిపేట గ్రామస్తుల విన్నపం మేరకు నూతనంగా జిమ్ ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన జిమ్ ను ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ…..

కాసిపేట గ్రామ యువతీ, యువకులు జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు శరీర ఆకృతిని పెంచుకోడానికి కూడా జిమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువకులకు క్రీడా వసతి పెంచడానికి సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. గ్రామంలోని మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. డ్రైనేజీ, వీధిదీపాలు వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాదావత్ నీల రాంచందర్, ఏజెంట్ రాంబాబు, గని మేనేజర్ సతీష్, సివిల్ అధికారులు రాము ,శ్రీధర్, యూనియన్ నాయకులు దాగం మల్లేష్, బన్న లక్ష్మన్ దాస్, వార్డుమెంబర్లు, పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచి తోపాటు గ్రామస్తులు, యువతీ, యువకులు, నాయకులు జనరల్ మేనేజర్ తో పాటు కాసిపేట – 1 గని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});