Singareni : సింగరేణిలో అధికారుల వేధింపులు

ఆర్హికంగా నష్టపోతున్న రిటైర్డ్ కార్మికులు లేని నిబంధనలను సృష్టిస్తున్న అధికారులు ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గుగనుల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు, ఉన్నతాధికారులు కార్మికులను అకారణంగా వేధిస్తున్నారని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో సింగరేణి సంస్థ పేరు, ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు చెమటోడ్చి సంస్థను అభివృద్ధి చేస్తుంటే, అధికారులు తమ ఇష్టానుసారం వ్యహరించడం సరికాదన్నారు. కొందరు...