CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 2:49 pm Posted by : coalbelt 24 News

cm revanth reddi : మెస్సి ఖర్చు ప్రభుత్వం భరించడంలేదు

cm revanth reddi : అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఈ నెల 13న భారత దేశంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మెస్సి తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన ” ద గోట్ టూర్ ” అనే సంస్థ మెస్సి పర్యటన ఏర్పాట్లను స్వతహాగా చేస్తోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. ఇరువై నిమిషాల పాటు రెండు జట్లతో మెస్సి ఆడుతారు. చివరి ఐదు నిముషాలు సీఎం రేవంత్ రెడ్డి తో మెస్సి ఫుట్ బాల ఆడుతారు.

ఉప్పల్ స్టేడియం లో నిర్వహించే ఆటకు సంస్థ నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఫుట్ బాల్ ఆటపై ఆసక్తి ఉండటంతో ఆడటానికి అంగీకరించారు. ఈ విషయంపై రాష్ట్రంలో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మెస్సి పర్యటన ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తోందన్నారు. ఆయన పర్యటన ఖర్చు అంతా కూడా “ద గోట్ టూర్ ” సంస్థనే భరిస్తోందన్నారు. సంస్థ ఆహ్వానం మేరకు తాను స్టేడియం వెళుతున్న. ఫుట్ బాల్ ఆటపై ఆసక్తి ఉండటంతో మెస్సి తో ఐదు నిముషాలు మాత్రమే ఆడుతున్నాను. ఆయన పర్యటన ఖర్చు ప్రభుత్వం భరించడంలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
———————————–
A.K.Kommera
స్పోర్ట్స్ బ్యూరో,
9603982983.
————————————

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});