CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 2:16 pm Posted by : coalbelt 24 News

Singareni : సింగరేణి సంస్థకు రక్షణ ప్రథమం

Singareni : సింగరేణి సంస్థకు రక్షణ ప్రథమమని రక్షణ వారోత్సవాల కన్వీనర్ విజయ ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసిపేట -1 సింగరేణి గని ఆవరణలో 56వ రక్షణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన గని అధికారులను, సూపర్ వైజర్లను, కార్మిక సంఘాల నాయకులను, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ…..

సింగరేణి సంస్థకు రక్షణ, ఉత్పత్తి రెండు కూడా సమానంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధిలో కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరు రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా విధులు నిర్వహించినప్పుడు కార్మికుడితో పాటు సంస్థకు కూడా నష్టం జరుగుతుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తేనే ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో ఏజెంట్ రాంబాలు,ఎస్ ఓ టు జి ఎం లలిత ప్రసాద్,మేనేజర్ సతీష్,రక్షణాధికారి నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్,డిప్యూటీ జనరల్ మేనేజర్,శివశంకర్,సూపరింటెండెంట్ అప్ ఇంజనీర్,శైలేంద్ర కుమార్, సర్వేయర్ రమేష్,మహేంద్రనాథ్,పోషమల్లు,నాగేశ్వరరావు, సారయ్య, శ్రీనివాస్,కుమారస్వామి,సంక్షేమ అధికారి,గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి సెక్రెటరీ దాగం మల్లేష్, గుర్తింపు సంఘం పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీనారాయణ తో పాటు రక్షణ కమిటీ సభ్యులు బి.రవీందర్,ఉద్యోగులు,పిట్ సేఫ్టీ కమిటీ,వర్క్ మెన్ ఇన్సఫెక్టర్స్ పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});