CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 12:45 pm Posted by : coalbelt 24 News

Sugar : ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వ్యాధి ఉన్నట్టే…….

Sugar : డయాబెటిస్ వ్యాధి సోకిన వారి సంఖ్య రోజు, రోజుకు పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండానే వ్యాధి కనబడుతోంది. షుగర్ శరీరంలో వ్యాప్తి చెందినంతమాత్రాన భయపడాల్సిన అవసరంలేదు. సక్రమంగా ఆహార నియమాలు పాటిస్తే షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య, వైద్య నిపుణులు చెబుతున్నారు.

తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఇన్సులిన్ పనితీరు సరిగా లేకపోవడం, సమయం ప్రకారం భోజనం చేయకపోవడం, మితిమీరిన ఆహారం తినడం, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వలన శరీరంలో మార్పులు జరిగి షుగర్ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చర్మం పొడిబారడం, గాయం తొందరగా నయం కాకపోవడం, బరువు తగ్గడం, దాహం పెరగడం, ఆకలి పెరగడం, దృష్టి మసకబారడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం, అలసట, కళ్ళు తిరిగి పడిపోవటం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం వంటివి శరీరంలో కనబడితే దాదాపుగా షుగర్ వ్యాధి సోకినట్టుగా భావించాల్సిందేనని ఆరోగ్య, వైద్య నిపుణులు చెబుతున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});