CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 9:42 am Posted by : coalbelt 24 News

Ethic : మట్టి పాత్రలతో ఆరోగ్యం

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Ethic : మట్టి పాత్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎతిక్ పాటశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎతిక్ పాఠశాలలో మట్టి పాత్రలు తయారు విధానం, వాటి ఉపయోగాలు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మట్టి పాత్రలు తయారుచేయు విధానంపై శిక్షణ ఇప్పించారు. ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ ………

నేటి తరం అంతా కూడా స్టీల్ పాత్రలను ఆహార పదార్థాల తయారు కోసం వినియోగిస్తున్నారు. పూర్వ కాలంలో మట్టి పాత్రల్లోనే ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడం వలన అప్పటి మానవులు ఎంతో ఆరోగ్యముగా ఉన్నారన్నారు. మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంచుకోవాలి. కాబట్టి మట్టి పాత్రలను వినియోగించుకొని ప్రతి ఒక్కరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి తో పాటు ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి రెడ్డి, ఉపాధ్యాయులు శ్రావణి, భావన, లావణ్య, సజిత, శృతి, శుచరిత, అనూష, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});