Mavoist : విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి లో చంపారు

Mavoist : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి మడావి హిడ్మాతో పాటు అతని భార్య రాజే ను విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లు లో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం మీడియా కు పంపిన లేఖలో వివరించారు. వారితో పాటు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ తో పాటు మరికొందరిని కూడా పట్టుకొని రంపచోడవరం లో కాల్చి చంపారని, ఈ రెండు సంఘటనలు కూడా కట్టుకథలేనని...