CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 8:35 am Posted by : coalbelt 24 News

Mavoist : విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి లో చంపారు

Mavoist : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి మడావి హిడ్మాతో పాటు అతని భార్య రాజే ను విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లు లో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం మీడియా కు పంపిన లేఖలో వివరించారు. వారితో పాటు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ తో పాటు మరికొందరిని కూడా పట్టుకొని రంపచోడవరం లో కాల్చి చంపారని, ఈ రెండు సంఘటనలు కూడా కట్టుకథలేనని అభయ్ తన లేఖలో ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 23న ప్రజలంతా నిరసన దినంగా పాటించాలని ఆయన కోరారు.

హిడ్మాతో పాటు అతని భార్య రాజే మరికొందరు కలిసి విజయవాడకు చికిత్స నిమిత్తం వెళ్లారు. కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకు నవంబర్ 15న నిరాయుధులైన వారిని విజయవాడలో పట్టుకొన్నారు. వారిని లొంగదీసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. హిడ్మాతో పాటు అతని భార్య, ఇతరులు లొంగకపోయేసరికి వారిని మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపారు. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని, కొందరు పారిపోయారని పోలీసులు ప్రకటించడం పచ్చి అబద్ధాలని అభయ్ తన లోఖలో ఆరోపించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తన అమూల్యమైన ప్రాణాలు అర్పించి, ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మా కు మావోయిస్టు పార్టీ శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. కాబట్టి ప్రజలంతా ఈ నెల 23 న నిరసన దినంగా పాటించాలని అభయ్ తన లేఖలో ప్రకటించారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});