CPM : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ: 50 వేల పరిహారం చెల్లించాలి
CPM : తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుకు ఒక ఎకరానికి రూ:50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెన్నూరులో నిర్వహించిన మండల స్థాయి పార్టీ సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు అప్పు చేసి పంటలు వేయగా తుఫాన్ కారణంగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మిరప, పత్తి, పసుపు, జొన్న, కంది తదితర పంటలు వేసిన రైతులు...